BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 04:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖ రుషికొండ బీచ్‌లో విషాదం.. స్నానానికి వెళ్లి బీకాం విద్యార్థి గల్లంతు

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:14 PM
13 వీక్షణలు

విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఓ యువకుడు అలల ఉద్ధృతికి గల్లంతయ్యాడు. స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన విద్యార్థి సముద్రంలో మాయమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం సయ్యద్ జాహిద్ రజా (19) తన స్నేహితులతో కలిసి రుషికొండ బీచ్‌కు వెళ్లాడు. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న జాహిద్ రజా బీచ్‌లో స్నేహితులతో కలిసి ఫొటోలు దిగిన అనంతరం సముద్రంలో స్నానానికి దిగాడు. అతనితో పాటు మరో ముగ్గురు యువకులు కూడా సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చిన బలమైన అలల ధాటికి జాహిద్ రజా సముద్రంలో గల్లంతయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన స్నేహితులు వెంటనే పోలీసులకు, లైఫ్‌గార్డులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు శనివారం రాత్రి వరకు పడవలతో సముద్రంలో గాలింపు చేపట్టినా విద్యార్థి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. రెండు హెలికాప్టర్లు, ఓ నౌక సహాయంతో అధికారులు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు. యువకుడి ఆచూకీ కోసం సహాయక బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.