BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:54 pm
Posted by : KADARI RAMANA

రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
10 Nov, 2026 - 04:54 PM
20 వీక్షణలు

తక్కువ నీటితో సాగయ్యే పంటలనే ఎంచుకోవాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: కలెక్టర్ భావిష్ మిశ్రా

సోన్ (ఎన్ టుడే న్యూస్):

జిల్లాలోని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ భావిష్ మిశ్రా ఆదేశించారు. రైతులకు సాగులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అండగా నిలవాలని సూచించారు.

సోమవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మెగా రైతు మేళా కార్యక్రమాన్ని కలెక్టర్ భావిష్ మిశ్రా సోన్ రైతు వేదిక నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, వ్యవసాయ సాగు విధానాలు, నీటి వినియోగంపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలను మాత్రమే ఎంచుకోవాలని తెలిపారు. నీటి లభ్యతను అంచనా వేసుకోకుండా అధిక నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.

జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ వీబీజీ రామ్ జీ పథకం ద్వారా ఉపాధి పొందాలని కలెక్టర్ తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.

రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం, పంటల సాగుకు సంబంధించిన సలహాలు స్థానికంగానే అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీపీఓ శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.