BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 06:33 pm
Posted by : K MAHESH

రైతు హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఏఐకేఎస్ జాతీయ మహాసభలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 06:33 PM
11 వీక్షణలు

నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో 36వ జాతీయ మహాసభలు.. రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని నాయకుల పిలుపు

బయ్యారం, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.

మహాసభల ప్రచారంలో భాగంగా బయ్యారం మండల కేంద్రంలోని సుందరయ్య స్తూపం వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో 36 జెండాలను సీనియర్ కామ్రేడ్ మెరుగు వెంకన్న ఆవిష్కరించారు. అనంతరం మంకెన తిరుపతిరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకుడు మండా రాజన్న, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నంబూరు మధు మాట్లాడుతూ.. రైతాంగ హక్కుల సాధన, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఏఐకేఎస్ నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 13 నెలల పాటు సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమంలో ఏఐకేఎస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు.

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలని కోరారు. అదేవిధంగా సాదాబైనామా భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని, కౌలు రైతులను గుర్తించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై జాతీయ మహాసభల్లో చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ నెల 15న నల్లగొండలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అంగిరేకుల నాగేశ్వరరావు, వల్లాల వెంకన్న, వెన్ను మోహన్, కత్తి రమేష్, నాగేష్, అప్పయ్య, యాకూబ్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.