దొరల గడీలను బద్దలు కొట్టిన ధీరవనిత ఐలమ్మ
దొరల గడీలను బద్దలు కొట్టిన ధీరవనిత ఐలమ్మ : మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీత
NTODAY NEWS :చిట్యాల,
దొరల గడీలను బద్దలు కొట్టిన ధీరవనిత ఐలమ్మ అని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా అన్నారు. నిజాం గుండాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, తెలంగాణ సాయుధ పోరాటంలో విప్లవ శంఖారావం పూరించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను చిట్యాల పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐలమ్మ చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పందిరి గీతారమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు మాట్లాడుతూ. బహుజన ఆత్మగౌరవానికి, భూపోరాటానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆమె పోరాట పటిమ, త్యాగనిరతి నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని, ఆ స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరూ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ మరియు మెప్మా సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరనారి స్మృతికి నీరాజనాలు అర్పించారు.