గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకాశ్ కొల్లూరు
తెలంగాణ
/
వరంగల్
- తెలంగాణ రక్షణ సేన తరఫున బరిలోకి.. ఎన్నికల అబ్జర్వర్‌గా డాక్టర్ చిట్నేని రఘు నియామకం
హైదరాబాద్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఆయన పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్, కోఆర్డినేటర్‌గా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ చిట్నేని రఘును నియమించారు. ఎన్నికలకు సంబంధించిన పార్టీ కార్యక్రమాల సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
అభ్యర్థి ప్రకటనతో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన తన రాజకీయ కార్యాచరణను ప్రారంభించింది.