మియాపూర్ 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం
- రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి రక్షణ.. తెలంగాణ ప్రజల విజయమన్న సీఎం రేవంత్ రెడ్డి
- రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను కాపాడాం
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల భూమిపై సర్వహక్కులు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చారిత్రాత్మకంగా అభివర్ణించారు. దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పు తెలంగాణ ప్రజలకు గొప్ప విజయమని పేర్కొన్నారు. మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కబ్జాదారుల ఆక్రమణల నుంచి కాపాడుకున్న ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయస్థానాల్లో సమర్థవంతంగా పోరాడి ఇప్పటివరకు దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను కాపాడినట్లు తెలిపారు. మియాపూర్‌తో పాటు రాష్ట్రంలోని ఏడు ప్రధాన ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను న్యాయపోరాటం ద్వారా సాధించామని వివరించారు.
కాపాడుకున్న భూములను అలాగే వదిలేస్తే మళ్లీ ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని, అందుకే వాటిని ప్రజా అవసరాలకు వినియోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. అటవీ శాఖకు చెందిన భూములను ఆ శాఖకు, రెవెన్యూ శాఖకు చెందిన భూములను సంబంధిత శాఖకు అప్పగిస్తామని తెలిపారు.
వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వ భూముల విక్రయం, తద్వారా సమకూరే నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేస్తుందని సీఎం తెలిపారు. ప్రధానంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి, నిరుపేదలకు విద్య, ఇందిరమ్మ ఇళ్లు, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిధులను వినియోగించాలనే ఆలోచన ఉందని వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని విలువైన భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. కాలనీల పేరుతో మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు, పెట్టుబడిదారులు ఆక్రమించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ప్రభుత్వ తరఫున న్యాయస్థానాల్లో బలమైన వాదనలు వినిపించామని చెప్పారు.
ధరణి ముసుగులో రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం, ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రయత్నాలు జరిగాయని సీఎం ఆరోపించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను న్యాయపోరాటం ద్వారా కాపాడినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
ఐఎంజీ భూములు: ఐఎంజీ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలను న్యాయపోరాటం ద్వారా అడ్డుకున్నామని తెలిపారు.
కంచ గచ్చిబౌలి: ఇక్కడి 400 ఎకరాల భూమిని న్యాయస్థానాల్లో పోరాడి సాధించినట్లు పేర్కొన్నారు.
మామిడిపల్లి: 450 ఎకరాల భూమిని కూడా న్యాయపోరాటం ద్వారా కాపాడినట్లు వెల్లడించారు.
సాహెబ్‌నగర్ కలాన్: హయత్‌నగర్ మండలం సర్వే నంబర్ 201లోని 140 ఎకరాల భూమిని రక్షించామని, ప్రభుత్వానికి, అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు.
కొండాపూర్: శేరిలింగంపల్లి మండలం సర్వే నంబర్ 59లోని 36 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని చెప్పారు. దాదాపు రూ.3,600 కోట్ల విలువైన ఈ భూమిపై 2025 సెప్టెంబర్ 3న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అనంతరం భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
మంచిరేవుల: గండిపేట మండలం సర్వే నంబర్ 393లోని 143 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడినట్లు తెలిపారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ను ఆనుకుని, గ్రేహౌండ్స్ ప్రాంతంలో ఉన్న ఈ భూమిలో 50 ఎకరాలను యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కోసం కేటాయించినట్లు వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో రూ.400 కోట్ల విలువైన 106 ఎకరాల అటవీ భూమిని ఒక రాజకీయ నాయకుడికి అప్పగించగా, సుప్రీంకోర్టులో పోరాడి తిరిగి కాపాడామని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని 600 ఎకరాల అటవీ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నించగా, న్యాయస్థానాల్లో పోరాడి రక్షించినట్లు తెలిపారు.
గత మూడేళ్లలో ఈ విధంగా ఏడు ప్రధాన ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడగలిగామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు న్యాయపోరాటం కొనసాగిస్తామని, కాపాడుకున్న భూములను ప్రజల అవసరాలకు