BREAKING
thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి భూముల కొరత! thumb ● బయ్యారం హైస్కూల్ విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ thumb ● బయ్యారం కుమ్మరి సంఘానికి నూతన కార్యవర్గం thumb ● అక్రమ బ్లాస్టింగ్‌పై 24 గంటల తర్వాత కదిలిన రెవెన్యూ అధికారులు thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి భూముల కొరత! thumb ● బయ్యారం హైస్కూల్ విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ thumb ● బయ్యారం కుమ్మరి సంఘానికి నూతన కార్యవర్గం thumb ● అక్రమ బ్లాస్టింగ్‌పై 24 గంటల తర్వాత కదిలిన రెవెన్యూ అధికారులు
మంచి మాట
Date of Publish : 30 October 2026, 07:25 pm
Posted by : KADARI RAMANA

విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన

తెలంగాణ
/ నిర్మల్
30 Oct, 2026 - 07:25 PM
2 వీక్షణలు

పోక్సో చట్టం, బాలల రక్షణపై నిర్మల్ వాసవి పాఠశాలలో అవగాహన సదస్సు

నిర్మల్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

విద్యార్థుల భద్రత, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు నిర్మల్ పట్టణంలోని వాసవి పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ పాన్ ఇండియా పాఠశాల అవగాహన ప్రచారంలో భాగంగా లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (పోక్సో–2012)పై విద్యార్థులకు వివరించారు.

వేధింపులకు గురైతే 1098కు సమాచారం ఇవ్వాలి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పోరిక రవీందర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరైనా లైంగికంగా వేధించినా, అనుచితంగా ప్రవర్తించినా భయపడకుండా వెంటనే పెద్దలకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి సహాయం పొందాలని తెలిపారు.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాలను వివరించి, తమ శరీరానికి సంబంధించిన వ్యక్తిగత హద్దులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా అనుచితంగా తాకేందుకు ప్రయత్నిస్తే వెంటనే ప్రతిఘటించి, నమ్మకమైన పెద్దలకు విషయం చెప్పాలని సూచించారు.

సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్త అవసరం

మొబైల్ ఫోన్ వినియోగం తప్పు కాదని, అయితే సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని రవీందర్ సూచించారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయం లేని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే అంగీకరించవద్దని హెచ్చరించారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకోవద్దని చెప్పారు. ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితుల్లో భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

విద్యార్థులు చదువుకు ప్రాధాన్యతనిస్తూ, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వాసవి విద్యాసంస్థల కరస్పాండెంట్ పోతారెడ్డి, అడ్వకేట్ నరేంద్రనాథ్, బి. సాయికుమార్, ఎం.డి. సిరాజ్ కౌసర్, పాఠశాల ప్రిన్సిపల్ ఎం. రాజ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.