BREAKING
thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి భూముల కొరత! thumb ● బయ్యారం హైస్కూల్ విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ thumb ● బయ్యారం కుమ్మరి సంఘానికి నూతన కార్యవర్గం thumb ● అక్రమ బ్లాస్టింగ్‌పై 24 గంటల తర్వాత కదిలిన రెవెన్యూ అధికారులు thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి భూముల కొరత! thumb ● బయ్యారం హైస్కూల్ విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ thumb ● బయ్యారం కుమ్మరి సంఘానికి నూతన కార్యవర్గం thumb ● అక్రమ బ్లాస్టింగ్‌పై 24 గంటల తర్వాత కదిలిన రెవెన్యూ అధికారులు
మంచి మాట
Date of Publish : 30 October 2026, 07:43 pm
Posted by : KOLA MAHESH

శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి భూముల కొరత!

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
30 Oct, 2026 - 07:43 PM
7 వీక్షణలు

ఆలయ పరిసరాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురవుతున్నాయంటూ భక్తుల ఆందోళన

రూ.50 కోట్ల అభివృద్ధి హామీ అమలుకు ముందుగా భూములను పరిరక్షించాలి

ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి

కురవి,:

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళి ఆలయ అభివృద్ధిపై మరోసారి చర్చ మొదలైంది. గిరిజనుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తామని ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని భక్తులు, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ గతంలో ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేయిస్తానని స్వామివారి సన్నిధిలో తన పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తల సమక్షంలో హామీ ఇచ్చినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఈ ప్రకటనపై భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే అభివృద్ధి పనులు చేపట్టాలంటే ముందుగా అవసరమైన భూములను గుర్తించి పరిరక్షించాలని వారు కోరుతున్నారు.

ఆలయ పరిసరాల్లో భూముల ఆక్రమణ ఆరోపణలు

శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆలయ అభివృద్ధికి అవసరమైన భూములు అన్యాక్రాంతమైతే భవిష్యత్తులో విస్తరణ పనులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భక్తులు చెబుతున్నారు.

ఈ భూములపై రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్రమణలు జరిగినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

హామీలు ఆచరణలోకి రావాలంటే భూముల పరిరక్షణ అవసరం

గతంలోనూ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు పాలకులు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పనులు జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా ఆలయ అభివృద్ధిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు.

రూ.50 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం కార్యరూపం దాల్చాలంటే ముందుగా అవసరమైన భూములను గుర్తించి, వాటిని ఆక్రమణల నుంచి కాపాడాలని భక్తులు కోరుతున్నారు. నిధుల మంజూరుతో పాటు అభివృద్ధి పనుల ప్రణాళికను కూడా స్పష్టంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గతంలో కలెక్టర్ సూచించినా చర్యలు తీసుకోలేదా?

గతంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన గౌతమ్ ఆలయ అభివృద్ధికి అవసరమైన అసైన్డ్ భూములను గుర్తించి కేటాయించాలని అప్పటి తహసీల్దార్ కొల్లూరు విజయకుమార్, ఆర్డీఓ దేవరాయ కొమరయ్యలకు సూచించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఆ సమయంలో భూముల కేటాయింపు ప్రక్రియ ముందుకు సాగలేదని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలి

ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆలయ పరిసరాల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను పరిశీలించి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పదవులు ఆశించే స్థానిక నాయకులు ఆలయ అభివృద్ధి, భూముల పరిరక్షణ విషయంలోనూ బాధ్యత తీసుకోవాలని భక్తులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ హామీలకే పరిమితం కాకుండా ఆలయ అభివృద్ధికి అవసరమైన భూముల పరిరక్షణ, నిధుల మంజూరు, పనుల ప్రారంభంపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.