ముగ్గుల పోటీలో ప్రథమ విజేతగా అక్షర
NTODAY NEWS : చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని 5వ వార్డులో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. 11 రోజులపాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు స్థానికులను ఆకట్టుకున్నాయి.
నేతాజీ యువజన సంఘం గౌరవాధ్యక్షుడు గుండెబోయిన సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో కొమిడాల అక్షర ప్రథమ విజేతగా నిలిచారు. ఆమెకు బుస్సా శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రథమ బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా అక్షరను నిర్వాహకులు, స్థానికులు అభినందించారు.
మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీయడంతో పాటు, సాంస్కృతిక స్ఫూర్తిని పెంపొందించడమే ముగ్గుల పోటీల ఉద్దేశమని గుండెబోయిన సైదులు తెలిపారు. 5వ వార్డులో ప్రతి ఏటా గణపతి ఉత్సవాలను ప్రజలంతా ఐక్యతతో ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, నేతాజీ యువజన సంఘం సభ్యులు, మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.