BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 06:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అల్లాపురం 552 మంది రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 06:50 PM
9 వీక్షణలు

గన్నవరం నియోజకవర్గం అల్లాపురం గ్రామానికి చెందిన 552 మంది రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని అఖిలభారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

11 సంవత్సరాల క్రితం తమ కష్టార్జిత సొమ్ముతో కొనుగోలు చేసుకున్న ఇళ్ల స్థలాలను గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం సేకరించిందని ఆయన తెలిపారు. భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు, నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితులకు నాయకత్వం వహిస్తున్న వేదవతి 11 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు, సంబంధిత మంత్రుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం బాధ్యతారాహిత్యమని హరినాథ్ అన్నారు. సమస్య పరిష్కారం కోసం బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతోందని తెలిపారు.

లబ్ధిదారుల్లో కొందరు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినా సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. బాధితులు తమ భూములకు ప్రత్యామ్నాయంగా భూములు, ఇళ్ల స్థలాలు మాత్రమే కోరుతున్నారని చెప్పారు. అజ్జంపూడిలో సుమారు 50 ఎకరాలను భూసమీకరణలో సేకరించిన నేపథ్యంలో, అర్హులైన 552 మందికి నష్టపరిహారం చెల్లించి, తక్షణమే ఇళ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని చేపడతామని హరినాథ్ హెచ్చరించారు. బాధితుల పోరాటానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, డాక్టర్ వసుంధర మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.