BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు
Date of Publish : 29 September 2026, 11:23 am
Posted by : A. MURALIDHAR

బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
29 Sep, 2026 - 11:23 AM
16 వీక్షణలు

బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు.. దాడి జరిగిందంటూ టెండర్‌దారు ఫిర్యాదు

చౌడేపల్లి, అన్నమయ్య జిల్లా: చౌడేపల్లి మండలం దిగువపల్లె గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్ల వ్యవహారంపై వివాదం నెలకొంది. టెండర్ నిబంధనల ప్రకారం డీడీలు సమర్పించేందుకు దేవస్థానం ఈవో కార్యాలయానికి వెళ్లిన సమయంలో తనపై దాడి జరిగిందని టెండర్‌దారు ఓ. వెంకట్ యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వెంకట్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవదాయ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ టెండర్ ప్రక్రియలో రెండు పనులకు టెండర్లు దాఖలు చేసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం ఒక్కో పనికి రూ.3 వేల చొప్పున మొత్తం రూ.6 వేల విలువైన రెండు డీడీలను దేవస్థానం ఈవో కార్యాలయంలో సమర్పించేందుకు తన మిత్రుడితో కలిసి వెళ్లినట్లు తెలిపారు.

అయితే డీడీలు స్వీకరించేందుకు కార్యాలయ సిబ్బంది ముందుకు రాలేదని, అనంతరం కొంతమంది వ్యక్తులు కార్యాలయంలోకి వచ్చి తమపై దాడికి పాల్పడి డీడీలను లాక్కొని చింపివేశారని వెంకట్ యాదవ్ ఆరోపించారు. సుమారు 30 మంది తమపై దాడికి పాల్పడ్డారని, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు కానిస్టేబుళ్లు అక్కడికి వచ్చారని తెలిపారు. పోలీసుల సమక్షంలోనూ తమపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

టెండర్‌కు ముందే పనులు ప్రారంభించారా?

టెండర్ ప్రక్రియ పూర్తికాకముందే సంబంధిత పనులు సుమారు 70 శాతం వరకు పూర్తయ్యాయని వెంకట్ యాదవ్ ఆరోపించారు. టెండర్ ప్రక్రియలో డీడీల స్వీకరణ, పనుల ప్రారంభం, తమపై జరిగినట్లు చెబుతున్న దాడి ఘటనపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని ఆయన కోరారు.

ఈవో వ్యవహారశైలిపై ప్రశ్నలు

టెండర్‌దారులు డీడీలు సమర్పించేందుకు వచ్చిన సమయంలో దేవస్థానం ఈవో కార్యాలయంలో అధికారుల వైఖరిపై స్పష్టత లేకపోవడం వల్లే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని వెంకట్ యాదవ్ ఆరోపించారు.

ఈ ఘటన జరిగిన తేదీ సెప్టెంబర్ 28న దేవస్థానం ఈవో ఏకాంబరం సెలవులోకి వెళ్లడంపైనా స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. టెండర్ ప్రక్రియ నుంచి దాడి ఘటన వరకు జరిగిన పరిణామాలపై ఈవో పాత్రతో సహా అన్ని అంశాలను ఉన్నతాధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

బాధితులను పరామర్శించిన బీసీవై పార్టీ అధినేత

ఈ ఘటనపై బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ బాధితులను ఫోన్ ద్వారా పరామర్శించారు. పార్టీ నాయకులు ఎద్దుల హరిబాబు యాదవ్, పాల రమేష్, కుమ్మరి గిరిబాబుతో పాటు పార్టీ కార్యకర్తలు బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.

టెండర్ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు, డీడీల స్వీకరణ, పనులు ప్రారంభమైన సమయం, దాడి ఘటనపై పోలీసులకు అందిన ఫిర్యాదు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. దేవదాయ శాఖ, పోలీసులు చేపట్టే విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.