BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
test
Date of Publish : 03 November 2026, 08:11 pm
Posted by : NAGARAJU GADE

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
03 Nov, 2026 - 08:11 PM
11 వీక్షణలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి: ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

మండవకురిటి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాజాం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ కోరారు.

మండవకురిటిలో ఎన్నికల ప్రచారం

సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

వైద్య సహాయం, తాగునీటి సౌకర్యాలపై ప్రస్తావన

నియోజకవర్గంలో పేదల వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3 కోట్ల విలువైన చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొంటూ, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.