BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

అన్నపై కొడవలితో దాడి.. తమ్ముడికి ఏడేళ్ల జైలు!

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 09:11 PM
42 వీక్షణలు

అన్నపై కొడవలితో దాడి.. తమ్ముడికి ఏడేళ్ల జైలు!

ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం.. నేరం రుజువుతో నిందితుడికి రూ.10 వేల జరిమానా

పటిష్ట సాక్ష్యాలతో కేసును ఛేదించిన పోలీసులు.. కుటుంబ వివాదాలను హింసాత్మకంగా పరిష్కరించుకోవద్దని సూచన

తిరుపతి, ఆగస్టు 11: ఆస్తి పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం చివరకు కొడవలితో దాడికి దారితీసింది. ఈ ఘటనలో అన్నపై దాడి చేసిన తమ్ముడికి న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో సమర్థవంతంగా ప్రవేశపెట్టడంతో నిందితుడికి శిక్ష పడేలా పోలీసులు చర్యలు చేపట్టారు.

2019లో పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపల్లి హరిజనవాడలో పెద్దల ఆస్తిగా ఉన్న మేకల పంపకం విషయంలో దాస్తోటి సుబ్రహ్మణ్యం, అతని అన్న దాస్తోటి నారాయణ మధ్య వివాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన సుబ్రహ్మణ్యం మెలికల కొడవలితో అన్న నారాయణపై దాడి చేశాడు. ఈ దాడిలో నారాయణ గాయపడ్డాడు.

ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటి పుల్లంపేట ఎస్సై ఎస్. వినోద్ కుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కేసుపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నేరం రుజువు చేసే కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.

కేసు విచారణ సమయంలో రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, కోడూరు రూరల్ సర్కిల్ సీఐ డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో పుల్లంపేట ఎస్సై వి. చిన్నరెడ్డప్ప సాక్షులను న్యాయస్థానానికి హాజరుపరిచి, విచారణ సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు.

పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు, వాదనలను పరిశీలించిన రాజంపేట అసిస్టెంట్ సెషన్స్ జడ్జి నక్క లావణ్య నిందితుడు దాస్తోటి సుబ్రహ్మణ్యం నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. దీంతో అతనికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

కుటుంబ వివాదాలపై పోలీసుల హెచ్చరిక

ఆస్తి, ఆర్థిక లేదా ఇతర కుటుంబ వివాదాలు తలెత్తినప్పుడు క్షణికావేశానికి లోనై హింసకు పాల్పడవద్దని పోలీసులు సూచించారు. సమస్యలను చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. చిన్నపాటి వివాదాలు హింసకు దారితీస్తే కేసులు నమోదవుతాయని, నేరం రుజువైతే న్యాయస్థానం ద్వారా కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు. సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్షలు పడేలా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.