బాలల భవిష్యత్తుకు పునాది అంగన్‌వాడీ విద్య
NTODAY NEWS చిట్యాల
బాలల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి విద్య అని ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత అన్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని గుండ్రంపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ మాసం వేడుకల్లో భాగంగా ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యా వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సునిత మాట్లాడుతూ చిన్నారుల సంరక్షణ, ఆరోగ్యం, ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చిన్నారుల మానసిక, శారీరక వికాసంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, ప్రీ-స్కూల్ పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యాబోధన అందించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ విద్యను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన కిట్లు, పుస్తకాలను సేకరించడం, వినియోగించడం గురించి వివరించారు. పిల్లల సంరక్షణ, పెంపకంలో తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండ్రంపల్లి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యురాలు లక్ష్మీ ప్రసన్న, స్థానిక పాఠశాల హెచ్‌ఎం ప్రేమలత, అంగన్‌వాడీ కార్యకర్తలు లక్ష్మీదేవి, శశికళ, ఆయాలు పి. లక్ష్మమ్మ, కె. కవితతో పాటు బి. జంగమ్మ, బి. ఇందిర, డి. కల్పన తదితరులు పాల్గొన్నారు.