BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 03:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దరఖాస్తులు పెండింగ్‌.. ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 03:47 PM
2 వీక్షణలు

దరఖాస్తులు పెండింగ్‌.. ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం తిరువూరు తహసీల్దార్‌కు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ ఫిర్యాదు

తిరువూరు: దరఖాస్తులు సమర్పించి రోజులు గడుస్తున్నా ప్రజలకు కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందడం లేదని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు తహసీల్దార్ చంద్రమౌళికి ఫిర్యాదు చేశారు. ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు వాటి జారీ కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలను మీ సేవా కేంద్రాలు, గ్రామ సచివాలయాల ద్వారా జారీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఆన్‌లైన్‌ సమస్యల కారణంగా అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిశీలించి, దరఖాస్తుదారులకు ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై స్పందించిన తహసీల్దార్ చంద్రమౌళి సమస్యను పరిశీలించి, ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చూస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కాలసాని నాగేశ్వరరావు, పరసా శ్రీనివాసరావు, వెలుగోటి ఆదినారాయణ, రామవరపు ప్రసాదు, పరస నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.