BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 03:09 pm
Posted by : SEETHA KIRAN KUMAR

విద్యాసంస్థల్లో సినిమా ఈవెంట్లు, ప్రైవేట్ కార్యక్రమాలకు కళ్లెం?

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
11 Nov, 2026 - 03:09 PM
2 వీక్షణలు

విద్యా ప్రాంగణాలను వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించకుండా మార్గదర్శకాల రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్: విద్యాసంస్థల ప్రాంగణాల్లో సినిమా ఈవెంట్లు, ప్రైవేట్ వేడుకలు, ఇతర వాణిజ్య కార్యక్రమాల నిర్వహణకు కట్టడి విధించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల భద్రత, విద్యాసంస్థల లక్ష్యం, విద్యా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల సినిమా ప్రదర్శనల కోసం మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం అకడమిక్ క్యాలెండర్‌కు విరుద్ధంగా సెలవులు ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థుల విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలిగేలా సినిమా కార్యక్రమాల కోసం సెలవులు ప్రకటించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తాయి. విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలుగా ఉండాల్సిన చోట, ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుకల సమయంలో ఓ విద్యార్థిని మృతి చెందడం కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో విద్యాసంస్థల ప్రాంగణాల్లో నిర్వహించే ప్రైవేట్ కార్యక్రమాల భద్రతా ఏర్పాట్లు, యాజమాన్యాల బాధ్యతలపై చర్చ మొదలైంది. విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తును నిర్మించాల్సినవా? లేక సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టే కార్యక్రమాలకు వేదికలుగా మారాలా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాసంస్థల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు? ఏ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలి? ఎలాంటి నిబంధనలు పాటించాలి? అనే అంశాలపై స్పష్టత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. విద్యాసంస్థలు చట్టపరంగా చేపట్టవచ్చే కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

ప్రాథమికంగా విద్యాసంస్థల ప్రాంగణాలను విద్యా సంబంధిత కార్యక్రమాలు, క్రీడా పోటీల నిర్వహణకు మాత్రమే వినియోగించేలా మార్గదర్శకాలు రూపొందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సినిమా ప్రచార కార్యక్రమాలు, ప్రైవేట్ వేడుకలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు విద్యాసంస్థల ప్రాంగణాలను వేదికలుగా ఉపయోగించకుండా నియంత్రణలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా విద్యాసంస్థల వెలుపలి వ్యక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే కార్యక్రమాలకు అనుమతి ఇచ్చే సందర్భంలో యాజమాన్యాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించే అవకాశం ఉంది. విద్యార్థుల భద్రత, కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, సంబంధిత అనుమతులు, ముందస్తు జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా చూడాలనే దిశగా మార్గదర్శకాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

అయితే ఈ మార్గదర్శకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విద్యాసంస్థల అసలు లక్ష్యమైన విద్యాబోధనకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు, విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించేలా నిబంధనలు అమల్లోకి వస్తాయా అన్నది వేచి చూడాలి.