BREAKING
thumb ● పండుగ సెలవులకు స్వగ్రామానికి వచ్చి ఆర్మీ జవాన్ మృతి thumb ● టీపీసీసీ అధికార ప్రతినిధిగా వంగాల వెంకన్న గౌడ్ నియామకం thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● పండుగ సెలవులకు స్వగ్రామానికి వచ్చి ఆర్మీ జవాన్ మృతి thumb ● టీపీసీసీ అధికార ప్రతినిధిగా వంగాల వెంకన్న గౌడ్ నియామకం thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా?
Test 4
Date of Publish : 10 November 2026, 09:49 am
Posted by : K MAHESH

పండుగ సెలవులకు స్వగ్రామానికి వచ్చి ఆర్మీ జవాన్ మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 09:49 AM
11 వీక్షణలు

రోడ్డు ప్రమాదంలో యువ సైనికుడు దుర్మరణం.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

యాదాద్రి భువనగిరి, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

పండుగ సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ఓ యువ ఆర్మీ జవాన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దేశ రక్షణలో సైనికుడిగా సేవలందిస్తున్న యువకుడు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పల్లపు మహేందర్ (26) మృతి చెందాడు. పండుగ సెలవులపై స్వగ్రామానికి వచ్చిన మహేందర్ ప్రమాదంలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదే ప్రమాదంలో మరో బైక్‌పై ప్రయాణిస్తున్న రామలింగం తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దేశ రక్షణ కోసం సైన్యంలో సేవలందిస్తున్న మహేందర్ సెలవులపై ఇంటికి వచ్చి తిరిగి వెళ్లకుండానే ప్రాణాలు కోల్పోవడం గ్రామస్థులను కలచివేసింది. చిన్న వయసులోనే యువ జవాన్ మృతి చెందడంతో కొండాపూర్ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.