BREAKING
thumb ● టీపీసీసీ అధికార ప్రతినిధిగా వంగాల వెంకన్న గౌడ్ నియామకం thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● టీపీసీసీ అధికార ప్రతినిధిగా వంగాల వెంకన్న గౌడ్ నియామకం thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్
Test 4
Date of Publish : 10 November 2026, 09:07 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండల పరిషత్ పీఠంపై ఉత్కంఠ.. ఎంపీపీ రేసులో నలుగురు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 09:07 AM
8 వీక్షణలు
  • వైసీపీ కంచుకోటలో కూటమి జెండా టీడీపీ నుంచి ముగ్గురు,
  • జనసేన నుంచి ఒకరు ఆశావహులు మంత్రి పార్థసారథి ఆశీస్సులు ఎవరికి..
  • ఎంపీపీ పదవిపై సర్వత్రా ఆసక్తి

చాట్రాయి: చాట్రాయి మండలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి గణనీయమైన విజయాన్ని నమోదు చేయడంతో ఇప్పుడు మండల పరిషత్ అధ్యక్ష పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మండలంలోని మొత్తం ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తొమ్మిది, జనసేన పార్టీ ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో కూటమిలోని ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. టీడీపీ నుంచి ముగ్గురి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగూడెం ఎంపీటీసీగా గెలుపొందిన మహాదేవ భాస్కరలక్ష్మి ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. గతంలోనూ ఎంపీటీసీగా పనిచేసిన ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె తండ్రి దివంగత యర్రోజు సత్యనారాయణ సోమవారం గ్రామానికి సర్పంచ్‌గా, ఎంపీటీసీగా సేవలందించారు. తనతో పాటు తన తండ్రి చేసిన సేవలను గుర్తించి ఎంపీపీగా అవకాశం కల్పించాలని మంత్రి పార్థసారథిని కోరుతున్నారు. అలాగే తుమ్మగూడెం ఎంపీటీసీగా విజయం సాధించిన కొల్లి సత్యవతి కూడా ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. ఆమె భర్త దివంగత కొల్లి వరప్రసాదరావు గతంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తమ కుటుంబానికి పార్టీతో ఉన్న అనుబంధం, గతంలో అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని తనకు అవకాశం కల్పించాలని ఆమె కోరుతున్నారు. మరోవైపు బూరుగుగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టున్న ప్రాంతంలో విజయం సాధించిన బీసీ వర్గానికి చెందిన బూబత్తుల నాగస్వరూప కూడా ఎంపీపీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తనకు అవకాశం కల్పిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి పార్థసారథిని కోరుతున్నారు. జనసేన నుంచి సవరం రామలక్ష్మి ఇదిలా ఉండగా చాట్రాయి ఎంపీటీసీగా జనసేన పార్టీ నుంచి గెలుపొందిన సవరం రామలక్ష్మి కూడా ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. మండల పరిషత్ అధ్యక్ష పదవిని మిత్ర ధర్మంలో భాగంగా జనసేనకు కేటాయించాలని, తనకు అవకాశం కల్పించేలా మంత్రి పార్థసారథి, జనసేన నాయకులు చొరవ చూపాలని కోరుతున్నారు. మంత్రి నిర్ణయంపైనే ఆశావహుల దృష్టి చాట్రాయి మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం టీడీపీకి చెందిన ముగ్గురు, జనసేనకు చెందిన ఒకరు పోటీలో ఉండటంతో కూటమిలో అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. సామాజిక సమీకరణాలు, గతంలో పార్టీకి చేసిన సేవలు, స్థానిక రాజకీయ పరిస్థితులు వంటి అంశాలు ఎంపికలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంత్రి పార్థసారథి సూచనలు, కూటమి నాయకుల మధ్య జరిగే చర్చల అనంతరం ఎంపీపీ పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో చాట్రాయి మండల పరిషత్ పీఠం ఎవరిని వరిస్తుందన్నది మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.