BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 09:42 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

ఆత్రేయపురం ఎంపీపీ పీఠం కూటమి కైవసం.. తొలిసారిగా ఉచ్చిలి గ్రామానికి అవకాశం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
13 Nov, 2026 - 09:42 AM
22 వీక్షణలు

19 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి 13, జనసేన–వైఎస్సార్సీపీకి రెండు స్థానాలు.. ఎంపీపీగా తోటకూర సుబ్బరాజు పేరు ఖరారైనట్లు సమాచారం

ఆత్రేయపురం: ఆత్రేయపురం మండల పరిషత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మండలంలోని మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 13 స్థానాలను కైవసం చేసుకోగా, జనసేన, వైఎస్సార్సీపీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. కూటమి మెజారిటీ స్థానాలను సాధించడంతో మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం కూటమి ఖాతాలోకి వెళ్లనుంది.

ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి సహకారంతో ఈసారి ఎంపీపీ పదవి ఉచ్చిలి గ్రామానికి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పేరవరం, ర్యాలి, ఆత్రేయపురం గ్రామాలకు చెందిన నాయకులే ఎంపీపీ పదవులను నిర్వహించగా, తొలిసారిగా ఉచ్చిలి గ్రామానికి ఈ అవకాశం లభించనుంది. దీంతో గ్రామ రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉచ్చిలి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎన్నికైన తోటకూర సుబ్బరాజు (55) మండల పరిషత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కూటమి నాయకత్వం ఆయన పేరును ఎంపీపీ పదవికి పరిశీలించినట్లు తెలుస్తోంది. అధికారిక ఎన్నిక ప్రక్రియ అనంతరం ఈ పదవిపై స్పష్టత రానుంది.

మరోవైపు జనసేన తరఫున ర్యాలి గ్రామం నుంచి పోటీ చేసిన బందెల నాగన్న 1,465 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి దాదాపు ఖాయమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాలతో ఆత్రేయపురం మండల పరిషత్‌లో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులు రెండు వేర్వేరు గ్రామాలకు దక్కనున్నాయి. తొలిసారిగా ఉచ్చిలి గ్రామానికి ఎంపీపీ పదవి లభించనుండటం, ర్యాలి గ్రామానికి ఉపాధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఉండటంతో స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.