BREAKING
thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు
Date of Publish : 02 October 2026, 12:56 pm
Posted by : NTODAY NEWS

గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
02 Oct, 2026 - 12:56 PM
50 వీక్షణలు

శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలం పేరవాండ్లపల్లి పంచాయతీలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రత, చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత మాట్లాడుతూ... ఇళ్లు, వీధుల్లో చెత్తను బయట పారబోస్తే దోమలు, ఈగలు చేరి పిల్లలకు, పెద్దలకు రకరకాల రోగాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటింటికీ వచ్చే చెత్త బండిలోనే చెత్తను వేస్తే గ్రామం శుభ్రంగా ఉండి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. "చెత్తను బయట పడేస్తే అనారోగ్యం.. సంచిలో వేస్తే ఆరోగ్యం.. అదే చెత్తను వేరు చేసి అమ్మితే ఆదాయం" అంటూ ఆమె ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు.

అలాగే దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి మహాత్మా గాంధీ చేసిన పోరాటాన్ని, ఆయన చూపిన బాటను ప్రజలందరూ ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, ఆయన ఆశయమైన 'స్వచ్ఛ భారత్' సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ గ్రామసభలో ప్రత్యేక అధికారి మోహన్ బాబు, ఈవోపీఆర్‌డీ మల్లికార్జున రెడ్డి, సాంకేతిక సహాయకులు (TA) రామాంజనేయులు, ఫీల్డ్ అసిస్టెంట్ బాబు, పంచాయతీ సిబ్బంది కృష్ణ, లక్ష్మీనరసప్ప, డిజిటల్ అసిస్టెంట్ చెన్నకేశవులు, శ్రీనివాసులు, నరసింహమూర్తిలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.