BREAKING
thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు thumb ● మోతే పరిసరాల్లో పులి సంచారంపై ప్రచారం.. thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● హుసేని కుటుంబానికి సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి పరామర్శ thumb ● బుధరావుపేట మోడల్ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం thumb ● MPTC, ZPTC కౌంటింగ్‌లో రిలీవర్‌కు అనుమతి లేదా? thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్
Test 4
Date of Publish : 06 November 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చండ్రుపట్లలో ఈ-వేస్ట్ నివారణపై అవగాహన..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Nov, 2026 - 08:02 PM
12 వీక్షణలు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026లో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒక వారం.. ఏడు ఆచరణలు.. ఒక భవిష్యత్తు అనే నినాదంతో ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతుండటం పర్యావరణానికి పెను ముప్పుగా మారుతోందని కార్యక్రమంలో వివరించారు. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా ఈ-వేస్ట్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో 2023–24లో 12.54 లక్షల టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి కాగా, 2024–25లో 13.98 లక్షల టన్నులకు చేరిందని వివరించారు.

పాత మొబైళ్లు, కంప్యూటర్లు, టీవీలను సాధారణ చెత్తలో కలిపి పారవేయడం వల్ల వాటిలోని హానికర పదార్థాలు నేల, నీటిని కలుషితం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బ్యాటరీలను నిర్లక్ష్యంగా పారవేయడం అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు.

పనిచేసే ఎలక్ట్రానిక్ వస్తువులను తిరిగి వినియోగించాలని, పాడైన వాటిని మరమ్మతులు చేయించుకోవాలని, పూర్తిగా పనికిరాని పరికరాలను గుర్తింపు పొందిన రీసైక్లింగ్ కేంద్రాలకు అప్పగించాలని సూచించారు. ఈ-వేస్ట్‌ను తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది, యూనిట్ ఇన్‌చార్జి జి. శ్రీనివాసరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.