BREAKING
thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
మంచి మాట
Date of Publish : 28 October 2026, 08:08 pm
Posted by : KOLA MAHESH

షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
Kola Mahesh Munugodu Constituency
28 Oct, 2026 - 08:08 PM
3 వీక్షణలు

షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

 వరంగల్ , అక్టోబర్ 28, :

తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, బుధరావుపేటలో ఈరోజు షీ టీం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సేవలు, ఫోక్ షో కేసుల గురించి పోలీసు సిబ్బంది వివరించారు. విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీంను సంప్రదించాలని సూచించారు.

టీనేజ్ దశ విద్యార్థుల జీవితంలో ఎంతో కీలకమైనదని, ఈ సమయంలో చదువుపై ఏకాగ్రత సాధించి, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థినులు తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు పోలీసుల సహాయం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు మౌలాలీ, తిరుపతి, భవ్యతో పాటు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మల్లికార్జున రావు, ఉపాధ్యాయులు శ్రీధర్, రాజేందర్, రాజేంద్రప్రసాద్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

యూత్ అండ్ ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం

అదేవిధంగా, పాఠశాలలో యూత్ అండ్ ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న చార్జర్లు, రిమోట్లు, చార్జింగ్ లైట్లు, స్పీకర్లు, కీబోర్డులు తదితర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పాఠశాలకు తీసుకువచ్చి అందజేశారు.

ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సాధారణ చెత్తలో కలపకుండా, పర్యావరణానికి హాని కలగని విధంగా శాస్త్రీయ పద్ధతుల్లో డిస్పోజల్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని ఈ సందర్భంగా వివరించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ అండ్ ఎకో క్లబ్ ఇన్‌చార్జ్ రాజేందర్‌ ,రాధికతోపాటు ఉపాధ్యాయులు  మల్లికార్జున రావు, రాజేంద్రప్రసాద్, విఘ్నేశ్వర రావు, శ్రీనివాస్, రాజ్‌కుమార్, వేణు, వసీం చారి ,నిర్మల, తదితరులు పాల్గొన్నారు.