మంకల్ దొడ్డిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభం
ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ
కుప్పం, అక్టోబర్ 6 (ఎన్ టుడే న్యూస్): కుప్పం నియోజకవర్గం మంకల్ దొడ్డి పంచాయతీ పరిధిలోని ఎన్. కొత్తపల్లి ప్రాథమిక వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను మంగళవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానున్న ప్రాథమిక వైద్య సేవలపై అధికారులు, వైద్య సిబ్బంది వివరించారు.
ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు.
మంకల్ దొడ్డి పంచాయతీ పరిధిలోని ప్రజలకు ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ అవుతాయని, స్థానిక ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీడీఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, డాక్టర్ గంగాదేవి, వైద్యాధికారి డాక్టర్ సుభాష్ రాజా, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
– డా. సుభాష్ రాజా
కుప్పం