BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 14 May 2026, 04:17 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
14 May, 2026 - 04:17 PM
60 వీక్షణలు

బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా ​ప్రమాదంలో గాయపడ్డ రైతుకు రూ.50 వేల ఆర్థిక సాయం ​మానవతా దృక్పథం చాటుకున్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

బాధితుడికి మంత్రి అడ్లూరి భరోసా

​ప్రమాదంలో గాయపడ్డ రైతుకు రూ.50 వేల ఆర్థిక సాయం

​మానవతా దృక్పథం చాటుకున్న మంత్రి

​గొల్లపల్లి, మే 14:

ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అండగా నిలిచారు. గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన రైతు గుడ్ల రాజయ్య ఇటీవల జరిగిన టిప్పర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

​ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే స్పందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితుడి కుటుంబానికి అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మంత్రి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు గురువారం బాధితుడి కుటుంబ సభ్యులను కలిసి ఈ నగదును అందజేశారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితుడి కుటుంబం అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు అగ్గిమల్ల గ్రామస్తులు, రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.