BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 14 May 2026, 05:30 pm
Posted by : కూనురు మధు

టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ మాతృమూర్తి కన్నుమూత

తెలంగాణ
/ నల్గొండ / శాలిగౌరారం
14 May, 2026 - 05:30 PM
489 వీక్షణలు

తరలివచ్చిన  ఉపాధ్యాయ లోకం

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ మాతృమూర్తి గురువారం ఉదయం 9 గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణ వార్త వినగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయుల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని వారి స్వగృహానికి పార్థివ దేహాన్ని తరలించగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఫోరం నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాతృమూర్తి పార్థివ దేహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భయ్యా శివరాజ్  మాట్లాడుతూ, షబ్బీర్  అలీ మాతృమూర్తి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.​ ఒక బలమైన ఉద్యమకారుడిని సమాజానికి అందించిన తల్లిని కోల్పోవడం చాలా బాధాకరం అని. ఈ కఠిన సమయంలో షేక్ షబ్బీర్ అలీ, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. మరణవార్త తెలిసిన వెంటనే వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు ఆకారం గ్రామానికి చేరుకుని షబ్బీర్ అలీని పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. పి ఐ డి ఏ రాష్ట్ర అధ్యక్షుడు కేతరాజు శంకర్, టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భయ్యా శివరాజ్, కోశాధికారి నవీన్,సాంస్కృతిక శాఖ రాష్ట్ర కార్యదర్శి తిరుమలేశ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు మధుమూర్తి, సంజీవరెడ్డి, చిట్యాల మండల అధ్యక్షులు నర్రా భిక్షం రెడ్డి,కూనురు మధు,సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ, జనగామ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ యాకుబ్ పాష, వర్కింగ్ ప్రెసిడెంట్స్ సాయి, సునీల్,వరంగల్ జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి సునీల్, తదితరులు ఉన్నారు