BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 14 May 2026, 06:15 pm
Posted by : కూనురు మధు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిన్నకాపర్తి
14 May, 2026 - 06:15 PM
171 వీక్షణలు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : డీఈఓ బిక్షపతి NTODAY NEWS చిట్యాల 

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'బడిబాట' కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి  బొల్లారం బిక్షపతి  గురువారం చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో పర్యటించారు. గ్రామం నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉపాధి హామీ పనులు చేసుకుంటున్న కూలీల వద్దకు నేరుగా వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి వేల రూపాయల డబ్బును వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని  తెలిపారు. బడిఈడు పిల్లలందరినీ తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఫలితాల్లో చిన్నకాపర్తి గ్రామానికి చెందిన హెచ్ శ్రీవిద్య  తమ ప్రతిభను అగ్రస్థాయిలో నిలిచి గ్రామానికి గర్వకారణంగా మారిందని ఆయన కొనియాడారు. అనంతరం  ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన చిన్నకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేకంగా అభినందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఇదే పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ విద్యను ఆశ్రయించాలి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్, మండల విద్యాధికారి సైదా నాయక్, వార్డ్ మెంబర్లు దయాకర్, రాజు , ఉపాధ్యాయులు భూపాల్ రెడ్డి, బాలకృష్ణ, నాయిముద్దీన్, ఆశ్రఫ్ అలీ, చంద్రశేఖర్, సాయిబాబా, అశోక్ రెడ్డి, రఘు, అబ్దుల్ గఫార్ తదితరులు పాల్గొన్నారు.