BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 28 June 2026, 06:26 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
28 Jun, 2026 - 06:26 PM
101 వీక్షణలు

విజయవాడ | NTODAY NEWS

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమాన్‌పేటలో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, పోలియో నిర్మూలనే లక్ష్యంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తమ చిన్నారులను సమీపంలోని పోలియో బూత్‌లకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. బూత్‌కు రాలేని చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక వైద్య బృందాలు సేవలందిస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, నగరపాలక సంస్థ అధికారులు, వైద్య సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.