BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 June 2026, 07:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర విరాళాల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 07:06 PM
175 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట | NTODAY NEWS

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ అయోధ్య బాలరాముడి ఆలయంలో భక్తులు సమర్పించిన నగలు, విరాళాల అక్రమాల ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయోధ్య రామమందిర నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసినప్పటికీ, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు చెందిన కొందరు వ్యక్తులపై భక్తులు సమర్పించిన ఆభరణాలు, విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు.

తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు అయోధ్య ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

సిట్ దర్యాప్తులో కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదు అక్రమాలకు గురైనట్లు వెల్లడైందని, పలువురిని అరెస్టు చేసి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే అసలు బాధ్యులను కాపాడుతూ కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు.

అయోధ్యలో సీసీటీవీ పర్యవేక్షణలో లోపాలు ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోందని, ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అక్రమాలకు సంబంధించిన అంశాలు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు డి. హరినాథ్ పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలు మరియు వ్యాఖ్యల ఆధారంగా ప్రచురించబడుతున్నాయి. సంబంధిత ఆరోపణలపై అధికారిక విచారణ వివరాలు వెలువడాల్సి ఉంది.