BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 28 June 2026, 05:49 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
28 Jun, 2026 - 05:49 PM
116 వీక్షణలు

NTODAY NEWS: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో విజయవాడ, గుంటూరు వెళ్లే బస్సులు సరిపడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు నిత్య ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇతర డిపోల నుంచి వచ్చే బస్సుల కోసం ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు వచ్చిన తర్వాత కూడా కూర్చునేందుకు సీట్లు లేకపోవడంతో పాటు నిలబడేందుకు కూడా స్థలం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణం కొనసాగిస్తున్నారు.

రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చిలకలూరిపేట నుంచి విజయవాడ, గుంటూరు మార్గాల్లో అదనపు బస్సు సర్వీసులను వెంటనే ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.