BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 10:35 am
Posted by : PAGADALA DEVAIAH

సతీమణితో కలిసి తిరుమలలో అంగప్రదక్షిణ సేవలో పాల్గొన్న బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
11 Nov, 2026 - 10:35 AM
31 వీక్షణలు

శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు.. గడ్డిఅన్నారం ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థన

ఎల్బీనగర్, నవంబర్ 11:

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తన సతీమణి బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమల క్షేత్రంలో శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించిన అనంతరం సంప్రదాయబద్ధంగా అంగప్రదక్షిణ సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా తిరుమలలో అంగప్రదక్షిణ సేవలో పాల్గొనడం ఆధ్యాత్మికంగా ప్రత్యేక అనుభూతిని కలిగించిందని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సతీమణితో కలిసి స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకోవడం సంతోషాన్ని, మనశ్శాంతిని కలిగించిందని పేర్కొన్నారు.

దర్శనం అనంతరం గడ్డిఅన్నారం ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు గడ్డిఅన్నారం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

అలాగే ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని, సమాజంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.

కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి దంపతులు అంగప్రదక్షిణ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.