BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 12:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బీజేపీకి నటుడు దేవన్ రాజీనామా.. టీవీకే వైపు అడుగులు!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 12:39 PM
77 వీక్షణలు

బీజేపీకి నటుడు దేవన్ రాజీనామా.. టీవీకే వైపు అడుగులు!

చెన్నై, ఆగస్టు 24: తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేరళకు చెందిన ప్రముఖ నటుడు దేవన్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని దేవన్ వెల్లడించారు. సెప్టెంబర్ 10న విజయ్‌ను వ్యక్తిగతంగా కలవనున్నట్లు తెలిపారు. ఆ భేటీ అనంతరం టీవీకేలో చేరికపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన దేవన్.. ఆ పార్టీలో తన ఆశయాలు నెరవేరే పరిస్థితి కనిపించలేదని అన్నారు. ‘‘బీజేపీ నేతలకు గెలుపుపై కంటే డబ్బుపైనే ఎక్కువ ఆసక్తి ఉంది. అక్కడ ఉంటే నా లక్ష్యాలను సాధించలేనని అర్థమైంది. అందుకే పార్టీకి రాజీనామా చేశాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మలయాళ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించిన దేవన్.. గతంలో రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. ఆయన టీవీకేలో చేరితే తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.