BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 02:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముప్పు లేదన్న విపత్తుల సంస్థ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 02:49 PM
42 వీక్షణలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత స్పష్టమైన అల్పపీడనంగా బలపడే అవకాశముందని తెలిపింది. మత్స్యకారులకు హెచ్చరికలు ఈ అల్పపీడనం ప్రభావంతో శని, ఆదివారాల్లో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర పరిస్థితులు అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్రంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఆ రెండు రోజుల్లో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీకి ప్రస్తుతానికి ప్రభావం లేదు అయితే ఈ అల్పపీడనం కారణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి వాతావరణ ముప్పు లేదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, తదుపరి మార్పులపై ప్రజలకు సమాచారం అందిస్తామని వెల్లడించింది.