BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 11:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెం రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం.. ఎంపీటీసీగా బూబత్తుల నాగస్వరూప విజయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 11:34 AM
114 వీక్షణలు

50 ఏళ్ల రాజకీయ ఆధిపత్యానికి తెర.. యువ గౌడ మహిళకు నియోజకవర్గ గౌడ సంఘం అభినందనలు ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం–పర్వతపురం రాజకీయ చరిత్రలో బూబత్తుల నాగస్వరూప విజయం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం నాయకులు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇప్పటివరకు గెలుపు సాధించలేని పరిస్థితుల నుంచి బయటపడి, ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాస్తూ ఎంపీటీసీగా విజయం సాధించడం విశేషమన్నారు. రాష్ట్రస్థాయి నాయకుడి రాజకీయ ప్రభావం ఉన్న గ్రామాల్లో ఈ విజయం సాధించడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. చాట్రాయి మండల గౌడ సంఘం అధ్యక్షుడు బూబత్తుల చెన్నారావు కుమార్తె బూబత్తుల నాగస్వరూప (25) ఎంఎస్సీ విద్యను అభ్యసించారు. యువతిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీటీసీగా విజయం సాధించడం పట్ల గౌడ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయంగా బలమైన ఆధిపత్యాన్ని ఎదుర్కొని విజయం సాధించిన గౌడ బిడ్డ నాగస్వరూపకు అభినందనలు తెలిపారు. నాగస్వరూప విజయానికి కీలక పాత్ర పోషించిన తండ్రి, చాట్రాయి మండల గౌడ సంఘం అధ్యక్షుడు బూబత్తుల చెన్నారావును నూజివీడు పట్టణంలోని అమర్ భవన్‌లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం (222/2019) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరీదు శివరామకృష్ణ, నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షుడు తల్లాడ శ్రీనివాసరావు శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు పామర్తి అచ్చేశ్వరరావు, చల్లారి సాంబశివరావు, కాసాని గంగయ్య, మల్లెల చెన్నారావు, పానుగంటి శివన్నారాయణ, నియోజకవర్గ నాయకులు నాగరాజు, ఆగిరిపల్లి యువజన నాయకులు బొల్లా శ్రీహరి, మణి, నూజివీడు గ్రామీణ ప్రాంతానికి చెందిన గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.