సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
వరంగల్: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో అక్టోబర్ నెలను సైబర్ మోసాలపై అవగాహన కల్పించే నెలగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ పోస్టర్లను పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాలు, ఈ-మెయిల్స్ లేదా అనుమానాస్పద లింకులు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా “ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి” అనే విధానాన్ని పాటించాలని సూచించారు.
కేవైసీ, బ్యాంకు ఖాతా బ్లాక్, లాటరీ, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులపై భారీ లాభాలు వంటి పేర్లతో వచ్చే మోసపూరిత కాల్స్, సందేశాలను నమ్మవద్దని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కోరిన వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదన్నారు.
ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో భారీ డిస్కౌంట్లు, అతి తక్కువ ధరల పేరుతో వచ్చే నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు వెబ్‌సైట్ యూఆర్‌ఎల్, విక్రేత వివరాలు, చెల్లింపు విధానం వంటి అంశాలను ధృవ