భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు, సెప్టెంబర్ 23: ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 24, 2026న జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్లకు చెందిన అన్ని కేటగిరీల విద్యాసంస్థలకు పరిహార సెలవు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర మేనేజ్‌మెంట్ల పరిధిలోని విద్యాసంస్థలు ఈ సెలవును పాటించాలని ఆమె సూచించారు.