నీలం యాదయ్య కుటుంబానికి భవానీమాత ఫౌండేషన్ 50 కిలోల బియ్యం అందజేత
దబ్బకుంటపల్లి: గ్రామానికి చెందిన నీలం యాదయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబానికి భవానీమాత ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.
గ్రామంలో నిరుపేద కుటుంబాల్లో ఎవరైనా మృతి చెందిన సందర్భంలో వారి కుటుంబాలకు తమ వంతు సహాయం అందించేందుకు భవానీమాత ఫౌండేషన్ ముందుకు వస్తుందని సభ్యులు తెలిపారు. ఆపద సమయంలో పేద కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా వారికి కొంతమేర అండగా నిలవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాపాక రాజు, దాసరి నవీన్, అనుప నరేష్, అనుప నవీన్ కుమార్, కొంత దయాకర్, దాసరి సురేష్, దాసరి రాజు, దండు కరుణాకర్, దండు బాలరాజు పాల్గొన్నారు.
అలాగే గ్రామ సర్పంచ్ చంద్రకళ స్వామి, వార్డు సభ్యుడు నీలం సిద్ధులు, ఆరేళ్ల రేణుక, కర్ణాకర్‌తో పాటు గ్రామ యువకులు ముచ్చనపల్లి హేమంత్, ముచ్చనపల్లి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.