తవేరా కారు ఢీకొని బైక్‌దారుడికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా: లింగపాలెం మండలం కళ్యాణంపాడు గ్రామంలోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో ఏలూరు–చింతలపూడి ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
కళ్యాణంపాడుకు చెందిన బుల్లా శ్రీను (37) మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా హైదరాబాద్ నుంచి పెదవేగి మండలం గార్లమడుగు వైపు వెళ్తున్న తవేరా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లా శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.