అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
అనంతపురం జిల్లాలోని సిద్దరాంపురం గ్రామంలో సుమారు 2 వేల కోళ్లు మృత్యువాత పడటంతో బర్డ్‌ఫ్లూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో జిల్లా పశువైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
మృతిచెందిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించి భోపాల్‌లోని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. పరీక్షల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
గ్రామంలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ, కోళ్ల పెంపకందారులకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముందుజాగ్రత్తగా కొంతకాలం చికెన్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నట్లు సమాచారం.