BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 02:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 02:11 PM
33 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద శనివారం శిరిడీ సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆమె పోరాట స్ఫూర్తిని పలువురు కొనియాడారు.

ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ మాట్లాడుతూ.. తెలంగాణలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని తెలిపారు. తన భూమిని లాక్కోవాలని ప్రయత్నించిన దొరల దౌర్జన్యాన్ని ఎదురించి, భూమిపై తన హక్కును కాపాడుకున్న వీరనారిగా ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. భూమి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆమె సాగించిన పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

సాయిబాబా యువజన కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలు, అంకితభావాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యంతో ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తుందని అన్నారు.

అనంతరం చిన్నారులు, గ్రామస్తులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో శీలం కృష్ణారెడ్డి, దేవర అంజలి, అనంత రాణి, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.