BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:11 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించిన బీజేపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 08:11 PM
9 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు: అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యత, చిన్నారుల అభివృద్ధి, గర్భిణీల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పుంగనూరు రూరల్ మండలం మాగాండ్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ‘అంగన్వాడీల ఉత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించనున్న ‘అంగన్వాడీల ఉత్సవం’ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలు, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సేవలపై తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

బీజేపీ పుంగనూరు రూరల్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా సహకరిస్తోందని తెలిపారు. చిన్నారులు, గర్భిణీల ఆరోగ్యం, పోషణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

బీజేపీ నాయకుడు యన్నాబత్తుల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణీలకు పోషకాహారం, ఆరోగ్య సంబంధిత సేవలు అందుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు మెరుగైన భవనాలు, మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

అంగన్వాడీ టీచర్ మునెమ్మ మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణీలకు అందిస్తున్న పోషకాహారం, వైద్య సేవలకు సంబంధించిన వివరాలను వివరించారు.

కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో ఔషధ మొక్కలను నాటారు. అనంతరం అంగన్వాడీ టీచర్, కార్యకర్తలను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు జి.ఆర్. విజయశంకర్, యన్నాబత్తుల విజయభాస్కర్ రెడ్డి, బీజేపీ యువ నాయకుడు సొంబే సోమశేఖర్, ఎస్సీ మోర్చా రూరల్ అధ్యక్షుడు నాగరాజ, తిరుమలేష్, గంగాధర, శేఖర్ బాబు, తిప్పన్న, అంగన్వాడీ ఆయా పద్మావతి, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.