చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
ఆధార్ కార్డుతో మృతుడిని గుర్తించిన పోలీసులు.. కారణాలపై దర్యాప్తు
ఆళ్లగడ్డ, ఎన్‌టుడే న్యూస్: ఆళ్లగడ్డలోని లింగుదిన్నె రోడ్డు వద్ద ఉన్న చర్చి శ్మశాన వాటికలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వేపచెట్టు కింద మృతదేహం ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వీఆర్వో వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పీరయ్య కేసు నమోదు చేశారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా గుజరాత్‌కు చెందిన మారు సంజయ్ బాయ్ (44)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మృతికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.