మధిర వాసవి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాల పుస్తకావిష్కరణ
మధిర: దసరా నవరాత్రుల సందర్భంగా మధిర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్లపోతు ప్రసాదరావు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త కోనా జనార్దన్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోన ధని కుమార్, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు వనమా వేణుగోపాల్ రావు (సూరి), శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణమండపం అధ్యక్షుడు కురువెళ్ల కృష్ణ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని అమ్మవారి సన్నిధిలో ఆవిష్కరించడం విశేషమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి కుంచం కృష్ణారావు, కోశాధికారి దాచేపల్లి రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్రా లక్ష్మణరావు, ప్రచార కార్యదర్శి వేముల నవీన్ కుమార్, అన్నదాన కమిటీ చైర్మన్ పల్లపోతు నరసింహారావు, ఉపాధ్యక్షులు కొప్పు రావూరి రామయోగేశ్వరరావు, గార్లపాటి సత్యనారాయణ, నేరెళ్ల శ్రీనివాసరావు, చెడే రామకోటేశ్వరరావు, కాజా చక్రధరావు, కార్యదర్శులు చలువాది కృష్ణమూర్తి, జంగాల మురళి, సహాయ కార్యదర్శులు వెచ్చా రామకృష్ణ, శ్రీమతి పల్లపోతు లీలావతి, కార్యవర్గ సభ్యులు పల్లపోతు గోపాలకృష్ణమూర్తి, కొత్తూరు నరసింహారావు, జల్లా రాధాకృష్ణమూర్తి, వేముల లక్ష్మీనారాయణ, కేతేపల్లి సురేష్‌తో పాటు భక్తులు కోనా నరసింహారావు, కోమటిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.