BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 12:36 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

గ్రంథాలయాలను వినియోగించుకుంటే ఉజ్వల భవిష్యత్తు: ఎంఈఓ రామిరెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
20 Nov, 2026 - 12:36 PM
23 వీక్షణలు

కనిగిరి: విద్యార్థినీ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని కనిగిరి ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు, ఎంఈఓ రామిరెడ్డి సూచించారు.

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు కనిగిరి శాఖా గ్రంథాలయంలో గ్రంథపాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ రామిరెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలను వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులను పుస్తక పఠనం వైపు ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సందర్శించి మంచి పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గురుస్వామిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. దేశ నాయకుల జీవిత చరిత్రలను తప్పనిసరిగా చదవాలని, ఆ అలవాటును పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పుస్తకాలను కొనుగోలు చేయకుండానే గ్రంథాలయంలో ఉచితంగా చదువుకునే అవకాశం ఉందని వివరించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రిట ఖాజా ఖాదర్ ఖాన్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, రమణారెడ్డి, పీడీ రాజేశ్వరి, మనీషా, విద్యార్థినీ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.