మార్కాపురం పరిధిలో గేదెల అదృశ్యం.. పాడి రైతుల్లో ఆందోళన
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
80 గేదెలు మాయమైనట్లు సమాచారం.. ఐదుగురు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
మార్కాపురం: మార్కాపురం పరిధిలో గేదెల అదృశ్య ఘటనలు పాడి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కంభం మండలం జంగంగుంట్ల, అర్ధవీడు మండలం నాగులవరం, కాకర్ల గ్రామాల పరిధిలో సుమారు 80 గేదెలు అదృశ్యమైనట్లు సమాచారం.
గేదెలు కనిపించకుండా పోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేయడంతో కంభం సర్కిల్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. గేదెల అదృశ్యం వెనుక కారణాలు, ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.