BREAKING
thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన
Date of Publish : 08 October 2026, 04:28 pm
Posted by : V శ్రీనివాస్

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Oct, 2026 - 04:28 PM
9 వీక్షణలు

మంచిర్యాల: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమానికి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పేరుతో పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు జరుగుతోందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

SIR ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, దాని అమలును తక్షణమే నిలిపివేయాలని సంఘం నాయకులు కోరారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా పారదర్శక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలనే తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.

అలాగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని, EVMల వినియోగంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమాలకు, ‘ఓటు చోర్–గద్దె చోడ్’ కార్యక్రమానికి తమ సంఘం మద్దతు కొనసాగుతుందని సమావేశంలో ప్రకటించారు.

ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఏ. గంగయ్య, సలహాదారుడు ఎం. అంజయ్య, నాయకులు బూర్ల జ్ఞాని, గజెల్లి సుదర్శన్, పి. రాంరెడ్డి, కాటం లక్ష్మణ్, ఏ. రాజేశం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘ఓటు చోర్–గద్దె చోడ్’, ‘ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలి’, ‘బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి’, ‘SIR ప్రక్రియను నిలిపివేయాలి’ అంటూ నినాదాలు చేశారు.