BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో 61 పాఠశాలల ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 06:45 PM
18 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని 61 పాఠశాలల్లో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. రెండు సంవత్సరాల కాలపరిమితికి నిర్వహించిన ఈ ఎన్నికల్లో మండలంలోని అన్ని పాఠశాలల్లో ఎస్ఎంసీ కమిటీలు ఏకగ్రీవంగా ఏర్పడ్డాయని మండల విద్యాశాఖ అధికారులు మాసగిరి శ్రీనివాస్, వి.ఎస్.వి. బ్రహ్మచారి తెలిపారు.

మండలంలో ఏడు ఉన్నత పాఠశాలలు, ఏడు ప్రాథమికోన్నత పాఠశాలలు, 47 ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించగా, అన్ని పాఠశాలల్లోనూ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషమని అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తయింది.

ఎస్ఎంసీ కమిటీల ఏర్పాటుకు సహకరించిన తల్లిదండ్రులు, గ్రామ పెద్దలకు అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చాట్రాయి ఎస్ఐ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి, వైద్య సహకారం అందించిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఎన్నికలకు పర్యవేక్షకులుగా ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్, ఎంఈఓ-2 వి.ఎస్.వి. బ్రహ్మచారి వ్యవహరించారు. ఎన్నికల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తూ అన్ని పాఠశాలల్లో కమిటీల ఏర్పాటును పూర్తి చేశారు.

నూతనంగా ఏర్పడిన ఎస్ఎంసీ కమిటీలు పాఠశాలల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని అధికారులు సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కమిటీలు చొరవ చూపాలని కోరారు.