BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 23 August 2026, 08:17 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో స్థానిక ఎన్నికల సెగ.. ఎంపీపీ పీఠంపై దేశిరెడ్డి రాఘవరెడ్డి ఆశలు? బూరుగుగూడెం సర్పంచ్ పదవిపై ఉమ్మడి సీతారాములు గురి?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 08:17 AM
408 వీక్షణలు

పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ నుంచి రాష్ట్రస్థాయి పదవి వరకు ఎదిగిన రాఘవరెడ్డి.. ఒకప్పుడు విస్సన్నపేట ఎమ్మెల్యే బరిలో ఉంటానని ప్రకటన. అయితే సమీకరణాల కనుగుణంగా అధికారం కోసం తనదైన శైలిలో పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొనుటలో అపర చాణుక్యుడను మించిన మేధస్సును కలిగిన వ్యక్తిగా భావిస్తుంటారు

రాష్ట్రస్థాయి నుంచి మళ్లీ మండల రాజకీయాల వైపు అడుగులు వేస్తారా?.. రాఘవరెడ్డి నిర్ణయంపై ఆసక్తి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ స్థానాలకు ప్రత్యక్ష పోటీ ఉండనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల పేర్లు, వారి రాజకీయ ప్రణాళికలపై చర్చలు ఊపందుకున్నాయి.

మండల పరిషత్ అధ్యక్ష పదవి రిజర్వేషన్ ప్రకారం ఓసీకి కేటాయిస్తే వైసీపీ తరఫున దేశిరెడ్డి రాఘవరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో చాట్రాయి మండల జెడ్పీటీసీగా కొనసాగిన రాఘవరెడ్డి స్థానిక సంస్థల రాజకీయాల్లో అనుభవం సంపాదించారు.

అనంతరం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ యూనియన్ చైర్మన్‌గా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవిని నిర్వహించారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎదిగిన రాఘవరెడ్డి రాజకీయ ప్రస్థానం చాట్రాయి మండలంలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా నిలుస్తోంది.

ఒకానొక దశలో నియోజకవర్గాల పునర్విభజన జరిగి విస్సన్నపేట నియోజకవర్గం ఏర్పడితే తాను విస్సన్నపేట శాసనసభ్యునిగా బరిలో ఉంటానని రాఘవరెడ్డి ప్రకటించిన సందర్భం కూడా ఉంది. దీంతో ఆయన రాజకీయ లక్ష్యాలు మండల స్థాయికే పరిమితం కాకుండా విస్తృతంగా ఉన్నాయనే చర్చ అప్పట్లో సాగింది.

అలాంటి రాజకీయ ఆకాంక్షలు ఉన్న రాఘవరెడ్డి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ మళ్లీ ఎంపీపీ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మండల పరిషత్ అధ్యక్ష పదవి తనకు దక్కాలని రాఘవరెడ్డి ఆశిస్తున్నట్లు ఆయన సహచర వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం, మండలంలోని గ్రామాల్లో ఉన్న పరిచయాలు, పార్టీ శ్రేణులతో ఉన్న అనుబంధం తనకు బలంగా మారుతుందని ఆయన వర్గం భావిస్తున్నట్లు సమాచారం.

అయితే రాష్ట్రస్థాయి పదవి నిర్వహించిన నాయకుడు మళ్లీ మండల స్థాయి పదవికి వస్తారా? లేక తన రాజకీయ ప్రయాణాన్ని మరో దిశగా కొనసాగిస్తారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయికి రాఘవరెడ్డి అడుగు వేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

బూరుగుగూడెం సర్పంచ్ పదవిపై ఉమ్మడి సీతారాములు కన్ను

ఇక బూరుగుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిపై ఉమ్మడి సీతారాములు ఆశలు పెట్టుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. సర్పంచ్ స్థానం బీసీకి రిజర్వ్ అయితే తాను బరిలో నిలవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన అనుచర వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి సీతారాములు బూరుగుగూడెం వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. సహకార సంఘ బాధ్యతల్లో ఉన్న సమయంలో రైతులు, గ్రామ ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు.

ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నప్పటికీ గ్రామ రాజకీయ పరిణామాలను గమనిస్తూ, పరోక్షంగా రాజకీయ వ్యవహారాల్లో తనదైన శైలిలో వ్యవహరించి ప్రజల్లో గుర్తింపు పొందారని స్థానికంగా చర్చ ఉంది. తన మాట తీరు, వ్యవహార చాతుర్యం, ప్రజలతో కలిసిమెలిసి ఉండే స్వభావంతో గ్రామంలో కొంత సపరేటు వర్గాన్ని పలుకుబడిని సంపాదించుకున్నారని ఆయన వర్గం భావిస్తోంది.

ఉద్యోగ విరమణ అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో సర్పంచ్ పదవిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రామంలో తనకు ఉన్న పరిచయాలు, సహకార రంగంలో ఉన్న అనుభవం తనకు అనుకూలంగా మారుతుందని సీతారాములు వర్గం అంచనా వేస్తోంది.

చాట్రాయి మండలంలో ప్రస్తుతం ఒకవైపు దేశిరెడ్డి రాఘవరెడ్డి ఎంపీపీ ఆశలు.. మరోవైపు ఉమ్మడి సీతారాములు సర్పంచ్ ఆశలు చర్చకు కేంద్రంగా మారాయి. రిజర్వేషన్ల ఖరారు, పార్టీ నిర్ణయాల తర్వాతే తుది రాజకీయ చిత్రం స్పష్టమయ్యే అవకాశం ఉంది.