BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 06 August 2026, 09:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఆధ్యాత్మిక శోభ.. కనకదుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 09:03 PM
104 వీక్షణలు

చాట్రాయిలో ఆధ్యాత్మిక శోభ.. కనకదుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పణ

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

చాట్రాయి, ఆగస్టు 6: ఏలూరు జిల్లా చాట్రాయి గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సారెను గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజనాలతో కిక్కిరిసిపోయి గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

మహోత్సవంలో భజన బృందాలు, హిందూ సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, ఆధ్యాత్మిక గీతాలతో అమ్మవారిని కీర్తిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

ఆషాఢ మాస సారె సమర్పణ కార్యక్రమం హిందూ సంప్రదాయాలకు, గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు.