చాట్రాయిలో వీసం సురేష్ బాబు 15వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన వీసం సిల్క్స్ అధినేత వీసం నరసింహారావు తృతీయ కుమారుడు వీసం సురేష్ బాబు 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులు, అనాథలకు దుస్తులు పంపిణీ చేశారు. అవసరాల్లో ఉన్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వీసం సురేష్ బాబు జ్ఞాపకార్థం ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వీసం బుల్లి బాబు, ఆంజనేయబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, పలువురు పాల్గొన్నారు.