BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 03 April 2026, 07:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రయి పోలీసుల పటిష్ట చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 07:41 PM
243 వీక్షణలు

చాట్రయి పోలీసుల పటిష్ట చర్యలు – మహనీయుల విగ్రహాలకు కట్టుదిట్టమైన రక్షణ

చాట్రయి, ఏప్రిల్ 3: చాట్రయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహనీయుల విగ్రహాల రక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో ఈ ప్రత్యేక భద్రతా కార్యక్రమం అమలు చేస్తున్నారు.

నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రయి ఎస్ఐ డి. రామకృష్ణ సిబ్బందితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ఉన్న మహనీయుల విగ్రహాలను పరిశీలిస్తూ, ఆయా విగ్రహ కమిటీ సభ్యులతో సమావేశమై రక్షణ చర్యలపై కీలక సూచనలు చేశారు.

విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, అవి ఎల్లప్పుడూ పని చేసేలా చూసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విగ్రహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ గౌరవాన్ని కాపాడాలని కమిటీ సభ్యులకు తెలియజేశారు.

అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై స్థానిక యువత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహనీయుల విగ్రహాలకు హాని కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ డి. రామకృష్ణ హెచ్చరించారు.

గ్రామాల్లో శాంతిభద్రతలు నిలుపుకోవడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేశారు.